Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

మార్పు - Written by Kumaraswamy

                                మార్పు

ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో ఒక పాడి పరిశ్రమ ఉండేది. దానికి మారయ్య యజమాని. మారయ్య ఆ ఊరి సర్పంచి కూడా ..ఆ ఆ ఊరిలో అందరూ నిరక్ష్యరాసులే.. పాడి పరిశ్రమే వాళ్ళకి దిక్కు. ఊరి ప్రజలు తమ ఆవుల నుండి వచ్చిన పాలను ఆ పరిశ్రమలో అమ్మి డబ్బు సంపాదించుకునేవాళ్ళు. ప్రతి రోజు ఎన్నో లీటర్ల పాలని ఆ మారయ్య కొని, పట్టణానికి పంపేవాడు. ఆ ఊరి ప్రజలకి తెలియని విషయం ఏంటంటే ఆ పాలపరిశ్రమ యజమాని తమకి అతి తక్కువకి పాలు కొనడం. అది తెలిసిన కొందరికి వేరే బ్రతుకు దెరువు లేక అతి తక్కువ ధరకే పాలు అమ్మేవాళ్ళు. ఎండాకాలం వచ్చింది. గడ్డి లేక ఆవుపాలు తక్కువ ఇవ్వడం వల్ల ఆ ఊరి నుండి పాలు ఎక్కువ దొరకడం కష్టమని మారయ్య ఆ పాల పరిశ్రమ మూడునెలలు ఆపేసాడు. పైగా అప్పుగా ఎక్కువ వడ్డీకి లేని వాళ్ళకి డబ్బులని ఇచ్చి ఆ ఊరి ప్రజలని పీడించేవాడు, సమయానికి డబ్బులు ఇవ్వకుంటే ఇంట్లో సామానులు, వొంటిపై నగలు కూడా తీసుకుపోయేవాడు. ఆలా బ్రతుకు దెరువు పోయిన ఆ గ్రామం మూడు వారాల తర్వాత ఒక నిర్ణయానికొచ్చింది. మనమే పాలు అమ్ముకుందాం.మారయ్యకీ పాలు అమ్మొద్దు అని నిర్ణయించారు. కానీ ఎలా అని వాళ్లంతా ఆలోచించారు. వెంటనే ముగ్గురు వ్యక్తులు పట్టణానికి పోయి మూడు వందల లెటర్ పాలకి ఎంత అని కనుక్కున్నారు. చాలా చోట్లా తిరిగాక వాళ్ళకి మారయ్య ఎంత మోసం చేస్తున్నాడో తెలిస్తుంది. ఇరవయి సంవత్సరాలుగా మనం మోసపోయాం అని అర్ధమయింది. మూడు రోజులు పాలు పోయండి బాగుంటేనే లెక్క కడతాము అని ఒక పాల కేంద్రం చెప్పింది. చేసేది లేక సరే అన్నారు. వర్ష కాలం వచ్చాక అందరూ కలిసి అద్దెకి తెచ్చుకున్న ఒక మోటారు వాహనంలో పాలని మూడు రోజులు పట్టణానికి పంపారు. పాలకేంద్రం ఆ పాలని చూసి అనుకున్నదానికంటే ఎక్కువ ధర ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆలా నాలుగు నెలల్లో సొంత వాహనం కొనుక్కుని ఆ ఊరంతా కలిసి బాగుపడింది. ఇదంతా మారయ్య చూసి పోలీస్ కేసు పెట్టాడు. నన్ను మోసం చేసారు ఊరంతా అని రెండు ఏళ్ళు గడిచాక " మారయ్య ఊరి ప్రజల్ని తక్కువ ధరకి పాలు కొంటూ అందర్నీ మోసం చేయడమే కాక, అధిక వడ్డీ వసూలు చేసి ఎన్నో కుటుంబలు వీధిన పడే లాగ చేసినందుకు గాను మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఆ ఊరు అంత చదువుకుంది. ఆ ఊరిలో ఒక సమితి ఏర్పడింది. కలిసి కట్టుగా ఉండటం ఎలాగో ఆ ఊరు అందరికి నేర్పింది .

Yorum Gönder

0 Yorumlar